కలిగిరి,మనన్యూస్,ప్రతినిధి;:

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమం బుధవారం దుత్తలూరు నుండి ఉదయగిరి వరకు నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి కలిగిరి మండలం నుండి మరియు నియోజకవర్గం నుండి కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకంలో భాగమైన అన్నదాత సుఖీభవ అమలకు శ్రీకారం చుట్టిన కూటమి అధినాయకులకు ధన్యవాదములు తెలియజేసే లక్ష్యాలలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలో భారీగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహణకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన తెలిపారు. బుధవారం దుత్తలూరు తాసిల్దార్ కార్యాలయం సమీపం నుండి ఉదయగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సముదాయం వరకు భారీ ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రైతన్నల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ క్రమంలోనే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమయానికి రైతులకు పెట్టుబడి సాయం కింద వారి అకౌంట్లో 7000 రూపాయలు నగదను జమ చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనం అన్నారు. కలిగిరి మండలంలోని 23 పంచాయితీలకు చెందిన టిడిపి ,బిజెపి ,జనసేన, నాయకులు ప్రతి పంచాయతీ నుంచి రైతులు యొక్క ట్రాక్టర్ ర్యాలీ ప్రక్రియను కనివిని ఎరగని రీతిలో జయప్రదం చేయగలరని బొల్లినేని వెంకట రామారావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *