

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 7:తల్లిపాలు పుట్టిన బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి అన్నారు.బుధవారం మహమ్మద్‌నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తల్లులు పౌష్టిక ఆహారం తీసుకుంటే తల్లులూ ఆరోగ్యంగా ఉంటారు,పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు. తల్లిపాలు చిన్నారుల పెరుగుదలకే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకంగా పనిచేస్తాయి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ప్రభాత, అంగన్వాడీ టీచర్లు పార్వతి, రమా, ముక్తాబాయి పాల్గొన్నారు.