మన న్యూస్,తిరుపతి :
నగరంలో పెరుగుతున్న శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు నల్లగొండ వారి పల్లెలో ఉన్న మోటార్ వాహనాలలో అవసరంలేని ధ్వని హారన్లు, సైలెన్సర్లను అమర్చితే అటువంటి మెకానిక్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణమాచారి టు వీలర్ మెకానికులకు హెచ్చరించారు. బుధవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్ అధ్యక్షతన నగరంలోని టూ వీలర్ మెకానికులతో డి.ఎస్.పి రామకృష్ణమాచారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ శబ్ద కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని, వాటిని దృష్టిలో పెట్టుకొని మెకానికులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఎవరైనా టు వీలర్ల యజమానులు సైలెన్సర్లు, హారన్ లను అమర్చమని ఒత్తిడి తెస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రజల సహకారం వల్లనే ట్రాఫిక్ నిబంధనలు సమర్థవంతంగా అమలు అవుతాయని అందుకు మెకానికులు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఎస్ఐలతో పాటు, స్టేషన్ రైటర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్, మెకానిక్ యూనియన్లు నాయకులు మునిరెడ్డి, ప్రభు, గురువాచారి, మోహన్, సింధు, సాయి, వేలు, లుక్కి లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *