కవి శేఖరుడు గురజాడకు ఘనంగా నివాళి

మన న్యూస్: తిరుపతి, ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని రాయలసీమ రంగస్థలి ఛైర్మెన్ గుండాల గోపినాధ్ అన్నారు. గురజాడ 109 వ వర్ధంతిని చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాధ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో గురజాడ అప్పారావు ఒకరని గుర్తు చేసారు. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయన్నారు . అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని పేర్కొన్నారు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. ఆయనకు కవి శేఖర అనే బిరుదు ఉందని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రంగస్థలి సభ్యులు విజయభాస్కర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, రామలింగేశ్వర కుమార్,చిత్తరపు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.