

మన న్యూస్ పాచిపెంట జులై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మత్స్యకారులకు లైఫ్ అధునాతనమైన రక్షణ కిట్లు చాపలు పట్టే టైం లో ప్రమాదాలు జరగకుండా రక్షణ కిట్టులను పంపిణీచేయా లని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్ని రామయ్య నిర్వాసితుల సంఘం నాయకులు కోరాడ ఈశ్వరరావు సుంకు జర్నీ కొండలరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన మత్స్యకారులకు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం వలలు నాణ్యమైనవి పంపిణీ చేయాలని అన్నారు. ఈ విధంగా సరఫరా చేయకపోవడం వలన ప్రైవేటు వ్యాపారుల దగ్గర నాసిరకమైనటువంటి వాళ్లను కొనుగోలు చేసి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 160 మంది సహకార సంఘాల్లో మత్స్యకారులు సభ్యులు సొసైటీలో ఉన్న 100 మందికి పైగా బతుకు తెరువు కోసం నెల్లూరు ఏలూరు విజయవాడ ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సకాలంలో చేప పిల్లలు కూడా వేసి మంచి సంపాదన పెంచాలని మన బోట్లను వలలను పంపిణీ చేయాలని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు ఇటువంటి ఆదాయం లేని నిర్వాసిత మత్స్యకారులందరికి రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఇండ్లు లేని నిర్వాసితులకు ఇల్లు స్థలాల మంజూరు చేయాలని కోరారు. నిర్వాసిత మత్స్యకారులు సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు బద్నాన వసంతరావు కొటిస రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దగడ్డ జలాశయం నిర్వాసిత మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు పాల్గొన్నారు.