

వెదురుకుప్పం మన న్యూస్ : కార్వేటినగరం సమీపంలోని ఏ బి సి ఫ్రూట్ జ్యూస్ ఫ్యాక్టరీ నందు శుక్రవారం జీడి నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డి రమేష్ బాబు మాట్లాడుతూ యజమాన్యం మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యాలతో చర్చించిన తర్వాత, గిట్టుబాటు ధర కేజీకి 8 రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీని కలిపి మొత్తం కేజీకి 12 రూపాయలు ఇచ్చే విధంగా ప్రకటించడం జరిగింది, అయితే గత రెండు రోజులుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం, అన్నూరు వద్దగల ఎబిసి ఫ్రూట్ జ్యూస్ ఫ్యాక్టరీ వారు రైతులకు కేజీకి 5 రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించిడంతో మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు, మామిడికి ప్రభుత్వం వారు మరియు జిల్లా కలెక్టర్ వారు ప్రకటించిన కనీసం గిట్టుబాటు ధరను కూడా ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వము మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యాలతో చర్చించి రైతులకు ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర 8 రూపాయలని ఫ్యాక్టరీ యాజమాన్యాల నుండి మరియు 4 రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం ద్వారా ఇప్పించవలసినదిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.