

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మంగళవారానికి మూడవ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు టెంట్లు లోనికి వెళ్లి కూర్చోవడం జరిగింది. తమ డిమాండ్లు పరిష్కారం కోసం సమ్మె కొనసాగిస్తున్నారు. నాయకులు మాట్లాడుతూ రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఎక్స్ గ్రేషియా, దహన సంస్కారాలు పెంపు, ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనo,జీ.ఓ.నెం.36 ప్రకారం జీతాలు అమలు చేయాలని పై డిమాండ్లు అమలు చేసేంతవరకు తగ్గేదే లేదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.భాస్కర్, వై. సుబ్రహ్మణ్యం,కే.పోలయ్య, ఎస్.కె నయీమ్, ఎస్.కామేశ్వరరావు, సి.హెచ్.సుబ్బారావు, ఎం. రమణయ్య, మున్సిపల్ సంఘం గూడూరు పట్టణ కార్యదర్శి ధారా కోటేశ్వరరావు, గౌరవా ధ్యక్షులు జోగి. శివకుమార్, గూడూరు పట్టణ సి.ఐ.టియు ప్రధాన కార్యదర్శి బి.వి. రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.