ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకే కాల పరిమితి రద్దు -ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలి-ఆర్పీలకు ట్యాబుల పంపిణీలో ఎమ్మెల్యే సునీల్ కుమార్.

గూడూరు, మన న్యూస్. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు పురుషులతోపాటు మహిళల ముందు ఉండాలని దృఢ సంకల్పంతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే నని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం గూడూరు మునిసిపాలిటీ మెప్మా లో పనిచేస్తున్న 77 మంది రిసోర్స్ పర్సన్లకు గూడూరు శాసన సభ్యులు డా: పాశిం సునీల్ కుమార్ చేతులు మీదుగా రూ : 32,999/- ల విలువ గల ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రిసోర్స్ పర్సన్లు చే లచే పనులు చేయించుకొని ప్రతి 3 సంవత్సరాలకు ఆర్పీలను లను మార్పు చేసేవారని అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం ఆర్పీల సమస్యలను గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీరు పని చేసినన్ని రోజులు మీకు అవకాశం కల్పించేలా చేశారన్నారు. అదేవిధంగా ఆర్పీలు పని ఒత్తిడికి గురి అవుతున్నారనే ఉద్దేశ్యం తో కంప్యూటర్ లతో సమానమైన,నాణ్యమైన 32999/- రూపాయలు విలువచేసే ట్యాబ్ లను బహుమతిగా అందించారని, గతంలో కూడా మీకు ట్యాబ్ లను అందించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతి ఆర్ పి ప్రభుత్వ పథకాలను ప్రతి లబ్ధిదారునికి అందేలా చేయాలని పిలుపు నిచ్చారు .గూడూరు కమీషనర్ ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్పీలు అందరూ ఇక ప్రతి ఆన్లైన్ వర్క్స్ వేగవంతం చేసి రాష్ట్రంలోనే గూడూరు మునిసిపాలిటీ ని అన్ని కార్యక్రమాలలో ముందుంచి మన ఎమ్మెల్యేకు,ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, నాయకులు దశరథ రామిరెడ్డి, అమరేంద్ర, జనసేన నాయకులు చంద్ర నీల్,మెప్మా సిటీ మిషన్ మేనేజర్ పెంచలయ్య కమ్యూనిటీ ఆర్గనైజర్ చందన ,డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉషా పట్టణ సమాఖ్య అధ్యక్షులు సులోచనమ్మ, టిఎల్ఎఫ్ ఆర్ పి లు లు లక్ష్మి, సుజాత, రిసార్స్ పర్సన్స లు పాల్గొన్నారు.

Related Posts

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి;- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు, మండల‌ పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాలు, జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

_ రెఫరల్ చైర్మన్ స్లెస్సర్ బాబు శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులకు ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్, రెఫరల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!