

మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కొలకటీ వీధి, సాలూరు పట్టణ నివాసి అయిన కోట దేవి కోట ప్రసాద్ దంపతులు తమ కుటుంబంతో జూలై 2న తీర్థయాత్ర నిమిత్తం గుప్తేశ్వరం వెళ్లారు. తిరిగి జూలై 4వ తేదిన వచ్చేటప్పటికి, ఇంటి తాళాలు బీరువాలు పగులగొట్టి 15 తులాలు బంగారం, వెండి సామాన్లు పోయాయి. సాలూరు టౌన్ పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా, క్లూస్ టీం తో సంఘటనా స్థలాన్నీ సందర్శించి, బీరువాపైన, ఇంటి గేట్లు పైన ఫింగర్ ప్రింట్స్ ని తీసి ,తదుపరి దర్యాప్తు చేస్తున్నారని సాలూరు పట్టణ సీఐ బొమ్మిడి అప్పలనాయుడు తెలిపారు.