

పారదర్శకంగా గ్రామ కమిటీ ఎన్నిక
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూడ చైర్మన్ కటారి హేమలత అన్నారు శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 23 పంచాయితీల కార్యకర్తలతో నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చుడ చైర్మన్ కటారి హేమలత మాట్లాడుతూ 23 పంచాయితీల్లో కార్యకర్తలు నాయకుల సమన్వయముతోనే గ్రామ కమిటీ అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది వీరందరూ సమిష్టిగా పార్టీ బలోపేతానికి కలిసిమెలిసి కృషి చేయాలని వారికి తెలియజేశారు, పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అందరూ సర్దుకుని పోలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, రాజశేఖర్ నాయుడు, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుండయ్య , బాలాజీ నాయుడు మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు, బాబు నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు