

మన న్యూస్,తిరుపతి:– వంగవీటి రంగా 78వ జయంతి వేడుకలు అనంతవీధి సర్కిల్ లో ఘనంగా జరిగాయి. రంగా చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి నాయకులకు పంచారు. అనంతరం పేదలకు అన్నదానం పంపిణి చేశారు. సామాజిక న్యాయం కోసం జీవితాన్ని దారపోసిన గొప్ప నాయకుడు వంగవీటి రంగా అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రంగా పని చేశారని ఆయన చెప్పారు. రంగా ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. వంగవీటి రంగా ఎందరికో స్ఫూర్తి అని ఆయన చెప్పారు. అల్లూరి సీతారామరాజు జన్మదినం రోజే రంగా పుట్టిన రోజు రావడం యాదృక్షికం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఏపీ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ వుకా. విజయకుమార్, బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ ముద్రా. నారాయణ, కార్పొరేటర్లు పొన్నాల చంద్ర, ఎస్కే బాబు, నరసింహాచారి, నరేంద్ర, దూది శివ, తిరుత్తణి వేణుగోపాల్, కీర్తన, ఆర్కాట్ కృష్ణాప్రసాద్, సింగంశెట్టి సుబ్బారామయ్య, ఆముదాల వెంకటేష్, ఆముదాల తులసి, నీలాద్రి, గిరి, జయంతి, బండ్ల లక్ష్మీపతి, వూస మాధవ రావు, ఆళ్వార్ మురళీ, క్రికెట్ విజయ్, జేకే రాయల్, పొనగంటి భాస్కర్ , కోదండ, అశోక్, సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
