మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మండలంలోని రామానాయుడు పల్లి వద్ద రాష్ట్రప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పలు రకాల పండ్లు , పూలు తో చేసిన గజమాలలను క్రేన్ తో ఆయనకు వేశారు. 10వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి. అదేవిధంగా పదివేల మంది మహిళలకు చీరలు థామస్ పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని వరత్తూరు పంచాయతీ ఎ.కనికా పురం గ్రామానికి చెందిన పొదిలి వినోద్ నాయుడు సహకారంతో ఒక్కొక్కరికి రూ.50వేలు విలవచేసే 6 మూడు చక్రాల బ్యాటరీ సైకిల్ ను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేతులు మీదుగా మంది వికలాంగులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో చిత్తూరు , పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ , మురళి మోహన్, జిల్లా టిడిపి అధ్యక్షుడు సి ఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్, చూడ చైర్మన్ హేమలత, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణ నాయుడు, జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, మండలం టీడీపీ అధ్యక్షుడు స్వామి దాస్, నేతలు దేవసుందరం, దేవపత్ని ధనంజయ నాయుడు, కోదండ రెడ్డి, వర్రా యువరాజ్ రెడ్డి, కేతినేని లోకేష్ నాయుడు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *