శంఖవరం, మన న్యూస్ (అపురూప్):- శంఖవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా నూతనంగా నియమితులైన ఏ. లక్ష్మీరెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఏలూరు జిల్లా ఐ.పోలవరం మండలంలో ఎంపీడీవోగా పనిచేసిన ఈయన, అధికారిక బదిలీ మేరకు శంఖవరనికి వచ్చారు. విధులు చేపట్టిన అనంతరం ఆయన కార్యాలయం లోని ఇతర అధికారులు, సిబ్బందిని కలుసుకొని పరస్పర పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “శంఖవరం మండల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తాను.అన్ని గ్రామీణ ప్రాంతాల లోతైన అవసరాలను గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లక్ష్యిత వర్గాలకు సమర్థవంతంగా చేర్చేందుకు కృషి చేస్తాను అని తెలిపారు. మండలంలోని ప్రాథమిక అవసరాలు, పథకాల అమలు పట్ల పూర్తిగా అవగాహన ఏర్పరచుకొని, ప్రజలకు చేరువయ్యే అభివృద్ధి పనితీరును కొనసాగిస్తానని లక్ష్మీరెడ్డి హామీ ఇచ్చారు. ఇదే సందర్భంగా పలువురు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయనను శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *