మన న్యూస్ ,నెల్లూరు:- నెల్లూరు 11వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ – మంత్రిచే భారీ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ నగర్ వాసులు, అభిమానులు.నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి ప్లాంట్ లను రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ప్లాంట్ వద్ద ప్రత్యేక పూజలు మంత్రి నిర్వహించారు. 2 రూపాయలకే 20 లీటర్లు అందించిన మంత్రికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మంచినీటి దాతగా మంత్రి నారాయణని మహిళలు అభివర్ణించారు. అనంతరం టిడిపి శ్రేణులు మంత్రితో భారీ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళా అభిమానులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నగర కమీషనర్ నందన్ తో పాటు.. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. నగర అధ్యక్షుడు మామిడాల మధు.. 11 డివిజన్ ప్రెసిడెంట్ నాగేంద్ర..టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *