మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం :- పేదరికాన్ని నిర్మూలించేందుకు పక్కా ప్రణాళిక.- పి4 విధానంతో పేదలను ధనికులుగా మార్చేలా సీఎం కృషి.- 10 సూత్రాల అమలుతో స్వర్ణాంధ్ర 2047 సాకారం.పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా స్వర్ణాంధ్ర 2047ను అమలు చేయనున్నారని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సోమవారం స్వర్ణాంధ్ర-2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్‌ కార్యాలయాలను సోమవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గతంలో విజన్‌ 2020 ను ఏవిధంగా అమలు చేశారో.. నేడు స్వర్ణాంధ్ర 2047ను అమలు చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. 10 సూత్రాల ద్వారా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ క్రతువులో ఎంపీలు, ఎమ్మెల్యేలను అందరినీ భాగస్వాములను చేస్తున్నారన్నారు. ఐదుమంది బృందంతో నియోజకవర్గం యాక్షన్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. సచివాలయం దగ్గరే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికేలా చేయనున్నారన్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజల అవసరాల మేరకు యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నామన్నారు. అందరూ కలిసి ఐకమత్యంగా ఈ విజన్‌ను ముందుకు తీసుకువెళతామన్నారు. సీఎం చంద్రబాబు కలలను సాకారం చేసేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తో పాటు ఐదు మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌, నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *