మన న్యూస్ ,తోటపల్లి గూడూరు: ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా అడుగేసిన రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి దంపతులు.తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెం పంచాయతీలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గిరిజనులు, దళితులు, నిరుపేదలు నివసించే కాలనీలపై ప్రత్యేక దృష్టి నిలిపారు.వెంకన్నపాళెంలో రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన గ్రామస్తులు.గడపగడపకు వెళ్లి ప్రజలతో మమేకం కావడంతో పాటు సమస్యలపై ఆరా తీశారు.ప్రతి సమస్యను నమోదు చేసుకుని సంబంధిత అధికారులతో పరిష్కారం చేయిస్తామని హామీ ఇచ్చారు.టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన, రాబోయే కొద్ది రోజుల్లో అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన సోమిరెడ్డి దంపతులు.నియోజకవర్గంలో ప్రతి పంచాయతీకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని వెల్లడించారు.వెంకన్నపాళెం ప్రజల ప్రధాన సమస్య అయిన రోడ్డుకు రూ.70 లక్షలు మంజూరైనట్లు, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపిన సోమిరెడ్డి.ఎరుకులపాళెంలో జగనన్న కాలనీ పేరిట నిర్మాణం చేపట్టిన 40 ఇళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఈ సమస్యను ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి. సమస్యలను తెలుసుకునేందుకు తమ గడపకే వచ్చిన సోమిరెడ్డి కుటుంబానికి ధన్యవాదములు తెలియజేసిన ప్రజానీకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *