

మన న్యూస్, నెల్లూరు:- ఈనెల 10వ తేదీ కల్లా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశం .- పనుల్లో వేగం పెంచిన ఎన్.సి.సి సిబ్బందిని అభినందించిన మంత్రి .- ప్లే గ్రౌండ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, స్కూల్ లో వసతులు క్షుణ్ణంగా పరిశీలన .నెల్లూరు వీఆర్ హై స్కూల్ లో జరుగుతున్న పునఃప్రారంభ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. హైస్కూల్లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న పనులపై ఆరా తీశారు. క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ లను పరిశీలించారు. ఇంకా చేపట్టాల్సిన పనులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 10 వ తేదీకల్లా పనులు పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్లే గ్రౌండ్ ఎక్విప్ మెంట్ పై పలు సూచనలు చేశారు. వీ ఆర్ హై స్కూల్ పనుల్లో వేగం పెంచిన ఎన్ సీ సీ సిబ్బందిని మంత్రి నారాయణ అభినందించారు. డిజిటల్ విద్యకు సంబంధించిన పరికరాలు, ఫుర్నిచర్, తదితర అంశాలపై ఎన్సీసీ సిబ్బందిని అడిగి తెలుసుకుని ఇంకా ఏమేమి కావాలో అన్ని త్వరితగతన ఏర్పాటు చేయాలని సూచించారు.





