

మన న్యూస్: పినపాక మండలం చింతల బయ్యారం గ్రామంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె నరేష్, మండల అధ్యక్షులు గగ్గురి ఖాదర్ బాబు ఆధ్వర్యంలో వాడబలిజ సేవా సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్స్, మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాడ బలిజలు అంతా ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా ముందుకు సాగాలని కోరారు. ఆర్థికంగా విద్యా, వైద్య రంగాల్లో ముందుండాలని, అలాగే వాడ బలిజలు రాష్ట్రంలో గుర్తింపు పొందాలని అందుకు మత్స్యకారులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాడ బలిజ సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె నరేష్, మండల అధ్యక్షులు గగ్గురి ఖాదర్ బాబు, గ్రామ కుల పెద్ద తోట నర్శిమ్మ, రాంబాబు, తోట లక్ష్మయ్య, తోట శ్రీనివాసరావు, తోట రాజేష్, గ్రామ యువకులు తోట సంతోష్, తోట శ్రీకాంత్, బంద సర్వేశ్వరావు, సతీష్, వెంకటేష్, జింక నర్సిమ్మ, బతకయ్య, వెంకటేశ్వర్లు, తోట రమేష్, చంటి, బద్ది శ్రీను, జింక బాలు, పానెం యాహాన్, రాంబాబు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.