

మన న్యూస్,నిజాంసాగర్ , ( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి అందుతుందని పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పేర్కొన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి పనులను ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భీమ్రావు,నాయకులు ప్రజాపండరి,అనిస్,రాములు,సత్య గౌడ్,తదితరులు ఉన్నారు.