
మన న్యూస్ ,నెల్లూరు ,మే17:నెల్లూరు రాంజీ నగర్ వైసీపీ సిటీ కార్యాలయంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వైసిపి జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ సిద్ధిక్ ఆధ్వర్యంలో 48 వ డివిజన్ వైసిపి నాయకులు, కార్యకర్తలు కలిశారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా తామంతా కలిసి కట్టుగా పనిచేస్తామని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వారు తెలియజేసారు.పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
