

మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) గత వారం రోజులుగా ఓ వ్యక్తి ఉపాధి హామీ పనులకు వెళ్తూ అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మహమ్మద్ నగర్ మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే మహమ్మద్ నగర్ మండలంలోని ధూప్ సింగ్ తండా కు చెందిన బోడ నార్ల నాయక్ (57) అనే వ్యక్తి గత వారం రోజులుగా ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్నాడు.శుక్రవారం ఉదయం రోజు వారీగా ఉపాధి హామీ పనులకు వెళ్ళగా వాంతులు,విరేచనాలతో అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రి కి తరలించడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు మండల వైద్యాధికారి రోహిత్ కుమార్ పేర్కొన్నారు.ఉపాధి కూలీ బోడ నార్ల నాయక్ మృతికి గల కారణాలను, పంచనామా రిపోర్టులను పరిశీలించి పూర్తి నివేదికను వెల్లడించనున్నట్లు వైద్యాధికారి రోహిత్ కుమార్ తెలిపారు.