

మనన్యూస్.మనసురాబాద్:షేక్ పేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మధుకర్ రావు కి ప్రతిష్టాత్మక బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్ దక్కింది. టైమ్ టు గ్రో ఇన్ అసోసియేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ హోటల్లో 26వ ఎడ్యుకేషనల్ సమ్మిట్ 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ పేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మధుకర్ రావుకు బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్ అందించారు. విద్యార్థుల గొప్ప భవిత కోసం, వారి సమగ్రాభివృద్ధి కోసం ప్రిన్సిపల్ మధుకర్ రావు చేస్తున్న కృషిని కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ప్రశంసించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఛైర్మన్ ఎం.ఎం. షరీఫ్, ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి ప్రిన్సిపల్ మధుకర్ రావుకు తమ అభినందనలు తెలియజేశారు. తమ విద్యాసంస్థలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న మధుకర్ రావుకు బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్ దక్కడం గర్వంగా ఉందని వారు తెలియజేశారు. తమ మేనేజ్ మెంట్ ఇస్తున్న సపోర్ట్ , పేరెంట్స్ సహకారం వల్లే తాను ఈ అవార్డ్ అందుకోగలిగానని ప్రిన్సిపల్ మధుకర్ రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
