మనన్యూస్,చైతన్యపురి:న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ వాసులు తమ కాలనీలో వివిధ సమస్యలు,కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయం లో చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని కలిసి ప్రపోసల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపి ఈటెల రాజేందర్ సానుకూలంగా స్పందించి డివిజన్ అభివృద్ధికి సహకరిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో న్యూ దిల్సుఖ్ నగర్ కాలనీ అధ్యక్షులు రాజేశ్వర్ రావు, సెక్రటరి పద్మిని,ట్రెజరర్ సుష్మిత,గోవింద్ రాజు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు నవీన్ యాదవ్,సీనియర్ నాయకులు వినోద్ యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *