మహిళా సంఘాలు అభివృద్దే ప్రభుత్వం ధ్యేయం,సెర్ప్ అదనపు సి ఇ ఓ శ్రీరాములు వెల్లడి

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మహిళా సంఘాలు అభివృద్ధి,సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని రాష్ట్ర సెర్ఫ్ అదనపు సీఈవో కే శ్రీరాములు నాయుడు వెల్లడించారు. శనివారం నాడు మండలం విచ్చేసిన సందర్భంగా వెలుగు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వార్షిక అప్పులు జీవనోపాదుల గురించి ఆయన మహిళా సంఘాల ప్రతినిధులతో చర్చించారు. ఆయనతోపాటు డిఆర్డిఏ పిడి సుధారాణి సమావేశానికి హాజరయ్యారు.వార్షిక అప్పులు మరియు జీవనోపదులు గురుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించి రాష్ట్రంలో ఒక లక్ష 50 వేలు మంది ఎన్యూమీటర్ లను ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నారనీ అదనపు సీఈఓ తెలిపారు.ఈ సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర సెర్ప్ అదనపు సీఈఓ కె.శ్రీరాములు నాయుడు
గంగమ్మ గ్రామ సంఘం పరిధిలో సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలు సభ్యులు ఒక గ్రూపు గా ఏర్పడి ఆదాయం వచ్చే ఏక్టివిటీ నిర్వహిస్తే, అధిక ఆదాయం వస్తుందని, ఆ విధంగా ఆలోచన చెయ్యాలని తెలిపారు. ప్రస్తుతం స్త్రీ నిధి పథకంలో తీసుకొన్న రుణాలకు రూ 0.90 శాతం వడ్డీ పడగా, ఆ వడ్డీని 0.70 శాతానికి తగ్గించడానికి ప్రణాళికులు సిద్ధం చేస్తున్నామని, ఎక్కువ మంది సబ్యులు స్త్రీ నిధి పథకంలో అప్పులు తీసుకోవాలని, అలాగే మహిళా సంఘాలు సభ్యులు పొదుపు నుండి కూడా అప్పులు తీసుకొని, సంఘం ఆదాయం పెంచాలని కోరారు.గతంలో తీసుకొన్న అప్పులు ఏ జీవనోపాధి కోసం వినియోగించారని సభ్యులను ప్రశ్నించగా, అదే గ్రామానికి
చెందిన లక్ష్మీ గణపతి సంఘానికి చెందిన రౌతు లక్ష్మీ గతంలో తీసుకొన్న బ్యాంక్ లింకేజ్ రుణం రూ. 70 వేలు తీసుకున్నామని రోజుకు 10 లీటర్లు పాలు అమ్మగా, నెలకు రూ 12 వేలు ఆదాయం వస్తుందని అదనపు తెలియజేశారు. అలగే అదనపు సీఈఓ సర్వే చేస్తున్న
ఎన్యూమునీటర్ జట్ల పార్వతి మాట్లాడి సబ్యులకు సర్వే ఏ విధంగా చేస్తున్నావని, ఒక సభ్యురాలు ఆదాయం ఏ విదంగా లెక్కిస్తున్నారని ప్రశ్నించగా..? ప్రస్తుతం వస్తున్నా ఆదాయంలో ఖర్చులు పోనీ వచ్చిన మొత్తాన్ని ఆదాయంగా లెక్కిస్తున్నామని తెలుపగా, అదనపు సీఈఓ సంతృప్తి చెందారు. అలాగే మహిళా సంఘాలు సభ్యులు తప్పనిసరిగా ప్రతి నెల సమావేశాల పెట్టుకోవాలని, ఈ ఏడాది నుండి ప్రతి సంఘం ఒక సమావేశం స్థలం నిర్ణయించుకొని, జియో ఫినిషింగ్ చెయ్యాలని, ఇకనుండి ప్రతి సంఘం ఆ స్థలానికి వెళ్ళి సమావేశం పెట్టుకుంటేనే సమావేశం పెట్టినట్లు అవుతుందని తెలియజేశారు. పాడేరు, విశాఖపట్నం జిల్లాలో పర్యటించానాని, అమ్మలసలో ఎన్యూమీటర్ లకు ఈ సర్వే పై పూర్తి అవగాహన ఉందని తెలియజేశారు.
ఈ సమావేశంలో మన్యం జిల్లా
డిఆర్డిఏ పీడీ సుధారాణి, ఇన్ చార్జి ఏసి శివున్నాయుడు, సీసీ లు పి. రామకృష్ణ రావు, కె. భాస్కరరావు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!