

మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలోని గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోఎంపిసి చదువుతున్న జ్యోతుల సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించారు.కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాల లను మించి ఎం పి సి విభాగంలో అత్యున్నత మార్కులు సాధించి జిల్లా లో ప్రధమ స్థానంలో నిలిచారు.విద్యార్దిని జ్యోతుల సాయి జ్యోతి ని పలువురు అభినందించారు.అభినందించిన వారిలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రేడ్డి శ్రీనివాస్, మాధురి విద్యాసంస్థలు అదినేత కడారి తమ్మయ్య నాయుడు,జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్,జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు బలి రెడ్డి గంగబాబు,బస్సా దుర్గాప్రసాద్, చిట్టి బాబు,మామిడాల సూరిబాబు, ఓదూరి నాగేశ్వరరావు, కిషోర్ తదితరులు ఉన్నారు
