మీ ఆర్టీసీ బస్సును ఆదరించండి.,కార్గో నిర్వాహకులపై మండిపడ్డ డిపో మేనేజర్,అధిక చార్జీలు వసూలు చేస్తే చర్య లు,బస్టాండ్ శుభ్రం ఎక్కడ,వైఎస్ఆర్ కడప, పోరుమామిళ్ల

మనన్యూస్:ఆర్టీసీ సంస్థ మీసంస్థ..మీసంస్థ నడి పిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో సుఖవంత మైన ప్రయాణం చేయాలని,ఆదరిం చాలని బద్వేలు ఆర్టీసీ డిపో మేనేజర్
ఆర్.సి.జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం పోరుమామిళ్ళఆర్టీసీ బస్టాండ్ లో జరుగుతున్న మరమ్మ తులు,పనులను పరిశీలించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ అందిస్తున్న సేవలపై ఆరాతీశారు.ఈసంర్భం గా ఆయన మాట్లాడుతూ పోరుమామిళ్ళ ఆర్టీసీ బస్టాండ్ ను గత నెల రోజులుగా మరమ్మతులు చేసి అన్ని హంగులతో తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయని,త్వరలో మీకు మంచి సేవలు అందజేసే ఏర్పాట్లు చేస్తామన్నారు.ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం మంచిదని.ఏసమస్య లు వచ్చినా,అవసరం వచ్చినా నాదృష్టికి గాని,కంట్రోలర్ దృష్టికి తెచ్చినా వెంటనే పరిష్కారం చేస్తా మన్నారు.బస్సుల టైమింగ్ మార్చ డం గాని,ఇంకా అదనంగా బస్సులు నడపడం గాని చేస్తామన్నారు.ఆటో లు ఎక్కకుండా ఆర్టీసీ బస్సు లో ఎక్కాలన్నారు.వ్యాపారానికి మూల బిందువు అయిన పోరుమామిళ్ళ లో కార్గో సేవలు ఏర్పాటు చేశామని వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.కానీ ఇక్కడ అతి తక్కువ మంది వినియోగించుకుం టున్నారని,ఎక్కువగా పెంచాలన్నారు.లోటుపాట్లు ఉంటే చెప్పితే సరి దిద్దుకొంటామని చెప్పారు.డోర్ డెలివరీ కూడా చేయించే ఏర్పాటు చేస్తా మన్నారు.బి.కోడూరు కు బస్సు సౌకర్యం కల్పించాలని రామలక్షుమయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఆర్జి పరిశీలించామని రేపటి నుండి బస్సు నడుపు తామన్నారు.

కార్గో సేవల నిర్వాహకులపై ఆగ్రహం
ప్రజలకు అందరికి ఆమోదయోగ్య మైన సరసమైన ధరలకు అందు బాటులో ఉండాలన్న లక్ష్యం తో కార్గో సేవలు ఏర్పాటు చేస్తే ఇష్టారాజ్యంగా నడపటం ఎప్పుడు పడితే అప్పుడు చెప్పాపెట్టకుండా మూసి వేయడం,అధిక చార్జీలు వసూలు చేయడం,ముక్కుపిండీ హమాలి చార్జీలు వసూలు చేయడం ఏమిట ని నిర్వాహకులపై మండిపడ్డారు. మీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోండి,వేరే వారికి అప్పగిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనముందే ఎక్కువ పార్శిల్ చార్జీలు వసూళ్లు చేస్తావా అని మండి పడ్డారు.ఫిబ్రవరి,మార్చినెలలోవచ్చిన పార్శిల్స్ ఎందుకు వారికి చేర్చలేదని ఇలాగైతే మానుకోవాలని,మరో సారి ఇదే పునరావృతం అయితే పరిస్థితి వేరేగా ఉంటుందన్నారు.

బస్టాండ్ శుభ్రం ఎక్కడ

బస్టాండ్ లో మరమ్మతులు జరు గుతున్నాయని శుభ్రం చేయకుండా గాలికి వదిలేసి చోద్యం చేస్తున్నావా అంటూ కసువు తోసె నిర్వాహకు లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుండి ఎక్కడ అపరిశుభ్రంగా కని పించిన తక్షణమే తొలగించి కొత్త వారికి అప్పగిస్తామన్నారు.

అరుణాచలం కు ప్రత్యేక బస్సులు

బద్వేలు డిపో పరిసర ప్రాంత ప్రయాణీకుల సౌకర్యార్థం బద్వేలు ఆర్టీసీ డిపో వారు బద్వేలు నుండి బెంగళూరు కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ఏర్పాటు చేశారని, అరుణాచలంకు వెళ్లేందుకు ఇక్కడ నుండి శనివారం బస్సు నడుపుతున్నామని,వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ అవకాశాన్ని బద్వేల్ మరియు పరి సర ప్రాంత ప్రజలు, పొరుమామిల్ల ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..