

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- కోళ్ల ఫామ్ ను తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ గోవిందయ్య అసిస్టెంట్ డైరెక్టర్ రూప సుందరి ఎస్ఆర్ పురం మండలం శుక్రవారం లో మెదవాడ పంచాయతీ మర్రిపల్లి గ్రామంలో ఉన్న కోళ్ల ఫారం ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోళ్లకు బ్లడ్ ఫూ అలాంటి లక్షణాలు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలని వాటిపై యాజమాన్యానికి అవగాహన కల్పించి సూచనలను చేశారు. బ్లడ్ ఫూ వస్తే తమకు తెలియజేయాలని యాజమాన్యానికి తెలిపారు. కోళ్ల పెంపకం కోళ్లకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారని వాటి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారిని డాక్టర్ శ్రీవిద్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.