

మన న్యూస్,ఎస్ఆర్ పురం:– తండ్రిని హత్య చేసిన కుమారుడు నాగరాజు ను అరెస్ట్ చేసినట్లు సీఐ హనుమంతప్ప తెలిపారు. సిఐ హనుమంతప్ప కథనం మేరకు ఎస్ఆర్ పురం మండలం డి ఆర్ ఆర్ పురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు మందిడిని అతని కొడుకు నాగరాజు బుధవారం రాత్రి హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటవీ ప్రాంతంలో ఉండగా అతని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుమన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.