

మనన్యూస్,తిరుపతి:బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే విగ్రహానికి యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలుగుదేశం పార్టీ నేతలు గజపూలమాల వేసి నివాళులర్పించారు. శుక్రవారం తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆడిటోరియంలో నరసింహ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే, నందమూరి తారక రామారావు విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. ఓపెన్ టాప్ లారీలో నరసింహ యాదవ్ పార్టీ నేతలు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ర్యాలీగా ఆడిటోరియంకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్, టిడిపి రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం, టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చినబాబు, పార్టీ నాయకులు సుబ్బు యాదవ్, రామారావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
