

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ను బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా మాజీ కార్య నిర్వాహక కార్యదర్శి,తిరుపతి ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ శాలువతో ఘనంగా సత్కరించారు. శుక్రవారం తిరుపతి లోని కచ్చపి ఆడిటోరియంలో జరిగిన అభినందన సభలో నరసింహ యాదవ్ ను సత్కరించడంతోపాటు భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మునిరాజా యాదవ్ ఆకాంక్షించారు.
