

మన న్యూస్ : కామారెడ్డి జిల్లా
భిక్కనూర్ : నవంబర్ 14
మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాపార దుకాణ సముదాయాలకు అద్దె నిర్ణయించడం కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ…వ్యాపార దుకాణ సముదాయాలకు నెల సరి అద్దె కొరకు మూడు కేటగిరీలుగా విభజించి అద్దె నిర్ణహించడం జరిగిందని, ఇట్టి తీర్మానాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.
దుకాణ సముదాయాల మిగతా బకాయిలను వారం రోజులలోగా చెల్లించాలని సూచించారు. ప్రస్తుతం దుకాణదారుల ఆధీనంలో ఉన్న దుకాణాలను ఆధీనంలోకి తీసుకున్న రోజు నుండి కిరాయిలను చెల్లించాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్,గ్రామపంచాయతీ సిబ్బంది మరియు ఆయా వ్యాపార దుకాణాల యజమానులు పాల్గొనడం జరిగింది.