జి బి కే ఆర్ ఎస్ టి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

విద్యుత్ షాక్ కు గురైన బాధితుడికి పరామర్శ, అండగా ఉంటానని భరోసా..!

కాలనీలోని విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే..!

మనన్యూస్,వింజమూరు:పంచాయతీలోని జి బి కే ఆర్ ఎస్టి కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ చేతులు మీదుగా అందజేశారు. స్థానిక మండల అధికారులు నాయకులతో కలిసి కాలనీలోని వికలాంగులు వితంతువు డయాలసిస్ పేషంట్ల పింఛన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కాలనీవాసులు విద్యుత్ సమస్య ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అదేవిధంగా ఆ కాలనీలో విద్యుత్ షాక్ కు గురైన బాధితుడిని పరామర్శించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వైద్యం అందించాలని తెలియజేశారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో ఇచ్చిన 4000 పింఛన్లను ప్రతి నెల ఒకటో తేదీన అందజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే తల్లికి వందనం అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికన వేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సారధ్యంలో యువనేత విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి సర్పంచ్ నల్లగొండ సృజన మాజీ కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి గువ్వల కృష్ణారెడ్డి బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి రంగారావు ఎంపీటీసీ సభ్యురాలు యాకసిరి భవాని పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి వసంతరావు డేగ మధు యాదవ్ తిరుపతి ఆచారి ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!