

మనన్యూస్,తిరుపతి:తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కొత్తగా రెండు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని ఆరణి శ్రీనివాసులు చెప్పారు. అలాగే ప్రముఖ శైవ క్షేత్రమైన పళని నుంచి తిరుపతికి బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని తమిళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తుండటంతో స్థానికులతో పాటు తమిళనాడు భక్తులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చి ఇది మంచి ప్రభుత్వని ప్రజల చేత శెభాష్ అనిపించుకుంటోందని ఆయన తెలిపారు.
