నవోదయ సీటు సాధించడంతో జ్ఞాపికతో సత్కారం

మన న్యూస్ ప్రత్తిపాడు (అపురూప్) జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి సీటు సాధించిన తుమ్మల ఐశ్వర్యని ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు జ్ఞాపికను బహుకరించి అభినందించారు.ఈ సందర్బంగా దాసం శేషారావు మాట్లాడుతూ జవహర్ నవోదయ ఫలితాల్లో మా విద్యార్థిని తుమ్మల ఐశ్వర్య సత్తా చాటి ఓపెన్ కేటగిరీలో సీటు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఐశ్వర్య తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *