పేద బడుగు బలహీన వర్గాలకు అండగా టిడిపి

టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు

మన న్యూస్ ప్రత్తిపాడు (అపురూప్) టీడీపీ పార్టీకి కార్యకర్తలే బలం అని, పేద, బడుగు బలహీన వర్గాలకు అండగా టిడిపి పార్టీ ఉంటుందని అని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు అన్నారు. ప్రత్తిపాడు లో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పథకాన్ని కన్నబాబు, టిడిపి నాయకులు యాళ్ల జగదీష్ ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని అవమానాలకు గురి చేయడంతో ఆత్మ గౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు కేవలం 9 నెలలు కాలం లో రాష్ట్రం లో అధికారం లోకి వచ్చి అప్పటివరకు ఉన్న పెత్తందారి వ్యవస్థలను అదిగిమించి తెలుగుదేశం పార్టీ ద్వారా పేద, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకువచ్చేందుకు కృషి చేశారన్నారు. అనంతరం కేకు కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాళ్ళ విశేశ్వర రావు, మదినె దొరబాబు, మూరా చంటి, శెట్టిబత్తుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *