మన న్యూస్ ప్రత్తిపాడు (అపురూప్) ,కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు సర్పంచ్ మంతెన వెంకటరమణ,సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు ఆధ్వర్యంలో టిడిపి జెండా ఎగురవేశారు.అలాగే వేములపాలెం గ్రామంలో టిడిపి రాష్ట్ర యువత కార్యదర్శి లొండ లోవరాజు ఆధ్వర్యంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ముందుగా వారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకోని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాల్లో అనపర్తి దుర్గ, పొనగంటి వీర్రాజు,వెన్నా దొర బాబు,అర్జురపు రాంబాబు,దండు రాంబాబు,బొజ్జా భావనరుషి, గంధం అప్పలరాజు,జెడ్డా శ్రీను తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *