వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

మన న్యూస్ ప్రత్తిపాడు (అపురూప్)

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరు ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కిర్లంపూడి లో వేంచేసియున్న గ్రామ దేవత నూకాలమ్మ తల్లిని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీమణి పద్మావతి నూకాలమ్మ తల్లికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. గిరిబాబు మాట్లాడుతూ నూకాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరూ పై ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కాశి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *