

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: మండలం ధర్మవరంలో ఆదర్శ విద్యాలయం వారి స్వీయ పర్యవేక్షణ లో శ్రీ లక్ష్మి నవోదయ కోచింగ్ సెంటర్ లో తొలి ప్రయ్నంలోనే అత్యుత్తమ పలితాలు. నవోదయ ప్రవేశ పరీక్ష లో అర్హత కొరకు ప్రత్తిపాడు, కిర్లంపూడి మండలాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు శ్రీ లక్ష్మి కోచింగ్ సెంటర్ ధర్మవరంలో 20 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకోగా 6 మంది విద్యార్థులు విజయం సాధించారు. విజయం సాధించిన విద్యార్థులు గుండారపు చరిష్మ ఆదర్శ విద్యాలయం ధర్మవరం నక్కా విగ్న రాఘవి ఆదర్శ విద్యాలయం ధర్మవరం బోడ సాత్విక్ నోబుల్ బ్రెయిన్ ట్రీ స్కూల్ దివిలిమద్దాల రమణీ వేంకట కార్తీకదుర్గా ప్రసాద్ స్కూల్ సామర్లకోట. కురతాల లాస్య విజ్ఞాన భారతి తామరాడ. రాపర్తి సాయిశ్రీ రిషిక్ ప్రగతి ప్రత్తిపాడు. ఈ కోచింగ్ సెంటరు లో విద్యా బోధన అందించిన .. ఉగ్గిరాల అయ్యప్ప మాస్టర్ గాబు నందిని టీచర్ లను సత్కరించి అభినందించిన ఆదర్శ విద్యాలయం కరస్పాండెంట్ దాడి చిన్నారావు ప్రిన్సిపాల్ దాడి వేంకట రమణ హెడ్ మాస్టర్ దాడి రాంబాబు