

రెవిన్యూ అధికారులతో సదస్సు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
మనన్యూస్,వింజమూరు:రెవిన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ రెవిన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల తహసీల్దారులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ గ్రీవెన్స్ డే లో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలియజేశారు. ఇప్పటివరకు ఎన్ని అర్జీలు వచ్చాయో, వాటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయో అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులను తరచూ కార్యాలయాలు చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు. ప్రభుత్వానికి నాకు మంచి పేరు తేవాలని సూచించారు. జఠిలమైన సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని జిల్లా అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిద్దామని అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎనిమిది మండలాల తహసిల్దార్ లు డిప్యూటీ తహసిల్దార్ లు ఎనిమిది మండలాల టిడిపి మండల కన్వీనర్లు నాయకులు తదితరులు ఉన్నారు.
