

పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్
నవంబర్, 12, 2024 వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఔషద పరిశ్రమల ఏర్పాటుకు స్థలసేకరణ నిమిత్తం వెళ్ళిన ఆ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై లగచర్ల గ్రామస్తులు దాడి చేయడం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పినపాక తహశీల్దార్ కార్యాలయం అధికారులు సిబ్బంది అన్నారు. ఈ దాడికి నిరసనగా మంగళవారం పినపాక మండల తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులలో పాల్గొన్నారు. ఈ నిరసనలో తహశీల్దార్ అద్దంకి నరేష్, డిప్యూటీ తహశీల్దార్ సమ్మయ్య, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, సర్వేయర్ నరేష్, సురేష్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.