

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం అల్మాస్గూడ న్యూ మధురానగర్ రోడ్ నెంబర్ 1 లో కులకర్ణి భార్గవి,మధు సుధన్ నేతృత్వంలో కిడ్స్ క్లబ్ ప్రీస్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ ప్రారంభోత్సవ ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు స్కూలు యాజమాన్యాన్ని అభినందించారు.కిడ్స్ క్లబ్ ప్రీస్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ తమ స్కూల్లో ప్లే గ్రూప్,నర్సరీ,ఎల్కేజీ,యూకేజీ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు.విద్యార్థులకు సమ్మర్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి,5 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎదుల్ల ప్రతాపరెడ్డి,న్యూ మధురా నగర్ అధ్యక్షులు రామ్ రెడ్డి,ఇంద్రహిల్స్ కాలనీ అధ్యక్షులు సోమయ్య,శ్రీహిల్స్ కాలనీ ప్రెసిడెంట్ వెంకటేష్,జనరల్ సెక్రటరీ కె శ్యామ్ రావు, సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి ట్రెజరర్ వెంకట రెడ్డి,కాలనీ సభ్యులు సైదేశ్వర్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
