Oplus_131072

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మనకోసం మనం స్వచ్చంద సంస్థ నిర్వాహకులు పట్లోళ్ల కిషోర్ కుమార్ తన స్వంత ఖర్చుతో పరీక్ష ప్యాడ్,సామాగ్రిని అందజేశారు.ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు ఏదోవిధంగా సహాయం చేయడం అయన దాతృత్వనికి నిదర్శనం. ఆయనకు మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి అభినందనలు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మండలంలోని 350 మంది విద్యార్థులకు ప్యాట్లను సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది అన్నారు .గ్రామాలలో తనకు తోచినంత సాయంగా పట్లోళ్ల కిషోర్ కుమార్ ప్రజలకు ఏదో విధంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్ టియు జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుషాల్, ప్రధానకార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి,మహమ్మద్ నగర్ ఎంఈఓ అమర్ సింగ్, ప్రధానోపాధ్యాయులు వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *