65 మంది ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ సభ్యులకుఇన్సూరెన్స్ పాలసీలు
Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి): ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,లంపకలోవ సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ పోస్టు ఆఫీస్ నందు లభించే బజాజ్ యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కు రుసుము చెల్లించి జర్నలిస్టుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు.సుమారు 65 మంది జర్నలిస్టులకు గొంతిన సురేష్ ఇన్సూరెన్స్ రుసుము చెల్లించారు.ఈ సందర్భంగా గొంతిన సురేష్ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలని లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ,నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం . అందిస్తూ,ప్రజా సమస్యలను,పాలకుల తప్పులను ఎత్తి చూపి సమాజ అభ్యుదయానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి , అభినందనీయమని అన్నారు.జర్నలిస్టులకు తన వంతుగా ప్రమాద సమయంలో వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా పోస్టల్ ఇన్సూరెన్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు.జర్నలిస్టులకు పోస్టల్ అకౌంట్ తో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిన గొంతిన సురేష్ కి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఘన సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా పోస్టల్ సిబ్బంది పోస్టల్ ఇన్సూరెన్స్ యొక్క ఉపయోగాలను వివరించారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు గంటా మహాలక్ష్మి రావు (చంటిబాబు),మండల టిడిపి పార్టీ అమరాది వెంకటరావు,సీనియర్ నాయకులు యాళ్ల జగదీష్, కొమ్ముల కన్నబాబు,పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







