

Mana News :- పాచిపెంట,నవంబర్12( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ఏకలవ్య ఫౌండేషన్ పాడేరు వాటర్ షెడ్ మేనేజర్ ఎం ఉమా వెంకటేష్ ఆధ్వర్యంలో 20 మంది రైతులు పాచిపెంట మండలంలో పాదు కూరగాయల సాగును పరిశీలించారు.మంగళవారం నాడు మండలం పి కోనవలస,తెట్టెడు వలస, మాతమూరు,పాచిపెంట గ్రామాలలో సాగులో ఉన్న వివిధ కూరగాయల నమూనాలను పరిశీలించారు.ఈ సందర్భంగా పాచిపెంట మండల వ్యవసాయ కార్యాలయంలో ఉన్న ప్రకృతి సేద్య వనరుల కేంద్రాన్ని సందర్శించారు వ్యవసాయ అధికారి కే తిరుపతిలో మాట్లాడుతూ రైతులను వేరే జిల్లాలలో క్షేత్ర సుదర్శనకు తీసుకువచ్చినందుకు ఏకలవ్య ఫౌండేషన్ను అభినందించారు. అనంతరం రైతులకు పాచిపెంట మండలంలో సాగుతున్న పంటల స్థితిగతులు ప్రకృతి సేద్యానికి అమలు చేస్తున్న ప్రణాళికలు వివరించారు జీవామృతాలు కషాయాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ టెక్నికల్ కోఆర్డినేటర్ జి చంటిబాబు ప్రకృతి సేద్య సిఆర్పి సురేష్ విజయ్ మరియు రైతులు పాల్గొన్నారు.