

Mana News :- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి: మండలంలోని లింగంపర్తి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ద్వాదశి జ్యోతిర్లింగాల విగ్రహాలకు అభిషేకం,ప్రత్యేక పూజలు, హోమాలు తదితర కార్యక్రమాలను వివేకానంద స్వామి సేవాసమితి సభ్యులు,విశ్వహిందూ పరిషత్ సభ్యులు సంయుక్తంగా అర్చకులు ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు వరుపులు సుబ్బారావు, హోమంలో పాల్గొని పూజా తదితర కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్తీక మాసంలో సాంబశివుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా గత జన్మలో చేసిన పాపాలు నశించిపోయి అత్యంత పుణ్యఫలం లభిస్తుందని ఆయన అన్నారు. ప్రత్తిపాడు నియోజవర్గంలో వివిధ గ్రామాల్లో అనేక దైవ కార్యక్రమాల నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.ఇందులో భాగంగా లింగంపర్తి గ్రామంలో బుధవారం ద్వాదశి జ్యోతిర్లింగాల ప్రతిష్టను అత్యంత వైభవంగా గ్రామ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వివేకానంద సేవా సమితి సభ్యులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పంతం పద్మనాభం,విశ్వహిందూ పరిషత్ సభ్యులు కటకం కిరీటి,పాబోలు దేవి,బుగతా సుగుణ,మల్లేశ్వరి,ఇందిరా,గిరిజ, వివేకానంద సేవా సమితి కార్యవర్గ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
