డిగ్రీ,పీజీ కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలిఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,అమరావతి:నెల్లూరు
ఏపీ శాసనమండలి సమావేశాలలో సోమవారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు.డిగ్రీ విద్యార్థులతో పాటు పీజీ విద్యార్థులు 40 వేల మంది ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు..ఇంకా పెండింగ్ లో ఉండటం వల్ల కళాశాలలో సర్టిఫికెట్లు కూడా తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ ఎప్పటిలోగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తారని ప్రశ్నించారు. UG కోర్సులు చదువుతున్న విద్యార్థులకు 4200 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందక దాదాపుగా 13 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రోజు 2 వేల కోట్లు వసతి దీవెనకు హాస్టల్ ఫీజులు కూడా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.టిడిపి ప్రభుత్వంలో 2018-19 కి సంబందించి 1880 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత..2019-20..కి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులతో పాటు.. పాత బకాయిలను కలిపి 4200 కోట్ల రూపాయల ఒకేసారి జమ చేయడం జరిగిందన్నారు. క్రమం తప్పకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించిన ప్రభుత్వం.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని గుర్తు చేశారు.విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వాటిని త్వరగా చెల్లించి.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని.. ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో జిల్లా పరిషత్ లో హైస్కూల్ + పాఠశాలలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నయాన్నారు.గత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేద గ్రామీణ ఆడపిల్లలకు అందుబాటులో జూనియర్ కళాశాల ఉండాలన్న సంకల్పంతో 292 హైస్కూల్ + పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. హై స్కూల్ ప్లస్ పాఠశాలల మూలంగా అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పీజీటీ లుగా ప్రమోషన్ లు కల్పించామని తెలిపారు.ఆ తరువాత సంవత్సరం 2024 లో మరో 210 కో ఎడ్యుకేషన్ పాఠశాలను హై స్కూల్ ప్లస్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందులో విద్యార్థులు చేరినప్పటికీ స్టాఫ్ నియామకాలు చేపట్టకుండా వాటిని నిర్వీర్యం చేసిందన్నారు.తద్వారా చాలా మంది ఆడ పిల్లలు ఇంటర్ విద్యకు దూరమయ్యారని తెలిపారు.
అయితే, ఇప్పుడు పిల్లలు తక్కువగా ఉన్నారన్న కారణంగా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 502 హై స్కూల్ ప్లస్ పాఠశాలలనే రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ఇది పేద విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో హైస్కూల్ + పాఠశాలలుగా అయినా లేదా వాటిని జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా అయిన పేరు మార్చి అలానే కొనసాగించడం తో పాటు మిగిలిన 210 హై స్కూల్ ప్లస్ లలో కూడా పీజీటీ ల నియామకం జరిపి , పేద, బడుగు, బలహీన గ్రామీణ విద్యార్థులకు ఇంటర్ విద్యను చేరువ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

  • Related Posts

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 4 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 5 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి