

Mana News :- తిరుపతి జిల్లా రేణిగుంట (Renigunta) విమానాశ్రయంలో AR అలయన్స్ విమానం రద్దు కావడంపై ప్రయాణికులు నిరసనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని ఎలా రద్దు చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఉదయం 7గంటల 15 నిమిషాలకు రేణిగుంటకు రావాల్సిన విమానం రద్దు అయ్యింది. అలాగే రేణిగుంట నుంచి 8 గంటల 15 నిమిషాలకు తిరిగి వెళ్లాల్సిన విమానాన్ని అధికారులు రద్దు చేశారు. అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదంటూ ప్రయాణికులు మండిపడ్డారు.