ఘనంగా టీడీపీ నేత లక్కమనేని మధు జన్మదిన వేడుకలు

పలుచోట్ల అన్నదానం – ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ,మన న్యూస్…. తెలుగుదేశం పార్టీ నాయకులు లక్కమనేని మధుబాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నడుమ అత్యంత వేడుకగా ఈ వేడుకలు నిర్వహించారు. తొలుత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని వేదపండితులు ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నేరుగా పీవీ రోడ్డులోని కార్యాలయానికి చేరుకున్న మధుబాబుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని వెల్లం పాలెం, బహుదూర్ పేట, రామసేతు వంతెన తదితర ప్రాంతాల్లో జరిగిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. సాయంత్రం గాలి గోపురం సమీపంలో మిత్రులు, శ్రేయోభిలాషులు అభిమానుల మధ్య భారీ కేక్ కటింగ్ నిర్వహించారు.ఇదిలా ఉంటే అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందించారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చరవాణీ ద్వారా మధుబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, జనసేన నాయకులు, పలువురు స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కన్నలి ప్రతాపరెడ్డి, కన్నలి ప్రవీణ్ రెడ్డి, శ్రీకాళహస్తి జడ్పిటిసి కాపీరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటాచలం, మాజీ కౌన్సిలర్ రవీంద్రబాబు, ఉన్నం ప్రసాద్, నవీన్, వంశి, సోము, భార్గవ్, దశరథ, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు