

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో,ఎంపీడీవో డి. సూర్యనారాయణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ మండలంలోని ఐదు గ్రామాలకు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్లు ఇవ్వడం జరిగిందని, మండలంలోని ఎవరైతే ఎస్సీ రైతులు ఉన్నారో,ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు బరకాలను, డ్రమ్ములను అందజేయడం జరిగిందని అంతేకాకుండా అగ్రికల్చర్ లో భాగంగా చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారిని అగ్రికల్చర్ అధికారి గుర్తించి ఆయా గ్రామాలకు కొత్త విధానాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. వెలుగు సిబ్బందికి అక్షర భారత్ కార్యక్రమం ద్వారా కిట్లు, గౌరవ వేతనంగా 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, ఎర్రవరం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పని చేస్తూ ప్రమాదవశాస్తూ చనిపోయిన వ్యక్తికి 50 వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా రావడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నీరుకొండ రామకుమారి, వైస్ ఎంపీపీలు చిక్కాల రాజ్యలక్ష్మి,సాదిలోవరాజు, తాహసిల్దార్ కుసరాజు,ఎంఈఓ అబ్బాయి,వివిధ శాఖల అధికారులు,ఎంపీటీసీలు,గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.