

మనన్యూస్,నారాయణ పేట:తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, నిరుద్యోగుల కలను తీర్చే విధంగా కొలువుల పండుగను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని మఖ్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. హైద్రాబాద్ రవీంద్ర భారతి వేదికగా ప్రజా ప్రభుత్వం లో కొలువుల పండుగ లో భాగంగా విద్య శాఖ లో 1532 మంది లెక్చరర్ ఉద్యోగ నియామక పత్రాలను తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో వేలాది ఉద్యోగాలను భర్తీ చేశామని, తాజాగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేశామని, త్వరలోనే ఉద్యోగ ఎంపికలు ఉంటాయని చెప్పారు. దీంతోపాటు వీలైనంత త్వరగా మరో డీఎస్సీ నోటిఫికేషన్ సైతం జారీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి
పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారీ, తదితరులు పాల్గొన్నారు.
